యూపీ ఎన్నికలపై పొత్తులకు సిద్ధమన్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
రిపోర్టర్: సతీష్
స్థలం: ఉత్తరప్రదేశ్
రాబోయే రెండు వేల ఇరవై ఏడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇతర రాజకీయ పార్టీలకు కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి ఎన్నికల వ్యూహం కోసం తమ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ రెండు నాటికి పొత్తులపై స్పష్టత ఇస్తామని వెల్లడిస్తూ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాజకీయ వ్యూహాలపై ఒవైసీ విమర్శలు గుప్పించారు.