విజయవాడ రైల్వేస్టేషన్లో డ్రగ్స్ కలకలం: పదకొండు లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Vijayawada
విజయవాడ రైల్వేస్టేషన్లో పదకొండు లక్షల రూపాయల విలువ చేసే నూట పది గ్రాముల ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తరలిస్తున్న నాగసౌమ్యను అరెస్టు చేసినట్లు జీఆర్పీ డీఎస్పీ జయసూర్య మీడియాకు వెల్లడించారు. నెల్లూరు జైల్లో ఉన్న ప్రియుడిని విడిపించేందుకు ఆమె కొరియర్‌గా పనిచేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు బషీర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.