పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ పర్యటన మరియు అభివృద్ధి పనుల ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: కాకినాడ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కేరళంలో చికిత్స అనంతరం ఏపీకి చేరుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు నూతన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు.