తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఆనం స్పష్టం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ప్రస్తుత పరిస్థితుల్లో లభ్యమయ్యే ప్రతి చుక్క నీటిని తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యతగా కేటాయించడం జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి పరిమిత వనరులతో సాగయ్యే తోటల రక్షణకు తగిన వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. నీటి లభ్యతపై ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.