పప్పుధాన్యాల సాగులో జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకున్న తెలంగాణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో జరిగిన జాతీయ రబీ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన పంటల వైవిధ్యీకరణ చర్యల కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో పప్పుధాన్యాల సాగు ఏకంగా ముప్పై ఆరు శాతం పెరిగినట్లు ఆయన తెలిపారు. ఈ విశేష పురోగతితో తెలంగాణ దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుందని మంత్రి స్పష్టం చేశారు. కరువు మండలాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు.