పేదలకు ఇళ్ల పట్టాల సర్వహక్కులు కల్పిస్తున్నామన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రమేష్ స్థలం: Andhra Pradesh

పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా 11 మండలాల పరిధిలోని 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. లబ్ధిదారులు నివసిస్తున్న ఇళ్లపై ఇక నుంచి పూర్తి సర్వహక్కులు వారికే ఉంటాయని స్పష్టం చేశారు. పేదల ముఖాల్లో ఆనందం చూడటమే తన జీవితానికి ధన్యత అని ఆయన పేర్కొన్నారు.