మోత్కూరులో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని సోమయ్య డిమాండ్
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
మోత్కూరు రైతు సేవా సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఓబీసీ మోర్చా జిల్లా ఇన్చార్జి పోచం సోమయ్య డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.