నా జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ది ప్యారడైజ్ సినిమా తెరకెక్కించా

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తొలి సినిమా దసరా విజయం తర్వాత హీరో నానితో కలిసి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. గోదావరిఖని ప్రాంతం, సికింద్రాబాద్ బస్తీ జీవితాల స్ఫూర్తితో నిజ జీవిత సంఘటనలకు కాల్పనిక అంశాలు జోడించి ఈ కథ సిద్ధం చేసినట్లు తెలిపారు. తల్లీకొడుకుల సెంటిమెంట్, తిరుగుబాటు తత్వంతో కూడిన ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నారని, అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని శ్రీకాంత్ ఓదెల ధీమా వ్యక్తం చేశారు.