యాదాద్రి థర్మల్ ప్లాంట్ సీఈ సురేశ్ నాయక్ సస్పెన్షన్

రిపోర్టర్: సతీష్ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో దామరచర్లలోని ప్లాంట్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ నాయక్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్లుగా నియమించినట్లు స్పష్టం చేశారు.