ప్రధాని మోదీకి అందిన జ్ఞాపికల ఈ-వేలం ప్రారంభించిన కేంద్ర మంత్రి
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన సుమారు పదిహేను వందలకు పైగా జ్ఞాపికలతో ఎనిమిదో విడత ఈ-వేలం ప్రక్రియ న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి ప్రారంభమైన ఈ వేలంలో దేశీయ సంస్కృతి, కళలు, క్రీడా విజయాలు, సాంకేతిక పురోగతిని ప్రతిబింబించే అరుదైన వస్తువులు, దేవాలయాల ప్రతిరూపాలు, సంప్రదాయ చిత్రకళా ఖజానాలు, క్రీడాకారుల ఆటోగ్రాఫ్ జెర్సీలు ప్రజల కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంచినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.