ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు, పోర్టులకు కనెక్టివిటీ కల్పించడంపై రైల్వేశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం, గద్వాల్ నుంచి మాచర్ల, దొనకొండ నుంచి ఒంగోలు, దూపాడు నుంచి బేతంచెర్ల, రాజంపేట నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కీలక కొత్త రైల్వే ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ కొత్త లైన్ల ద్వారా సరకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రైలు సదుపాయం అందుబాటులోకి రానుంది.