గోరఖ్‌పూర్‌లో ఇంట్లో నిద్రిస్తున్న విద్యార్థి దారుణ హత్య

రిపోర్టర్: గోపి స్థలం: గోరఖ్‌పూర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లాలోని జయంతిపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లోని వెరాండాలో నిద్రిస్తున్న పందొమ్మిదేళ్ల శుభమ్ మిశ్రా అనే బీఎస్సీ ప్రథమ సంవత్సర విద్యార్థిని గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తండ్రి కిడ్నీ చికిత్స కోసం కుటుంబ సభ్యులు లక్నో వెళ్లడంతో విద్యార్థి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఫోరెన్సిక్ టీమ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.