కాకినాడలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన: వేగంగా వెళ్లవద్దని హెచ్చరిక
రిపోర్టర్: వెంకట్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డాక్టర్ ఎం. కిషోర్ కుమార్ పర్యవేక్షణలో బాలాజీ చెరువు సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేస్తూ ప్రజలకు పలు కీలక సూచనలు జేశారు.