ఉత్తరప్రదేశ్లో దొంగ బాబాకు రెడ్ హ్యాండెడ్గా దేహశుద్ధి
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్లో వంద మందికి పైగా మహిళలను లైంగికంగా వాడుకున్న నకిలీ స్వామీజీ బాగోతం బట్టబయలైంది. ఓ హోటల్ గదిలో అడ్డంగా దొరికిపోయిన దొంగ బాబాకు స్థానికులు మరియు బాధితులు దేహశుద్ధి చేశారు. నకిలీ ఆధ్యాత్మిక ముసుగులో సాగుతున్న ఈ అరాచకాలను గుర్తించిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.