పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ బైఠాయింపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పులివెందుల
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆర్వో కార్యాలయం ఎదుట వైకాపా అధ్యక్షుడు జగన్ బైఠాయించి నిరసన చేపట్టారు. రీపోలింగ్ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యంపై గౌరవంతోనే తాను ఆనాడు ఎన్నికలను ఆపలేదని, మా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఘటనపై విచారణ జరిపిస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు.