అమెరికా విదేశాంగ విధాన మార్పుపై మేయర్ జోహ్రాన్ మమ్దానీ పిలుపు
రిపోర్టర్: నరేష్
స్థలం: New York
అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్ లో డెమొక్రాట్ల విజయాల నేపథ్యంలో ఇజ్రాయెల్ తో సంబంధాలపై విధాన మార్పు కోరుతున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండేలా కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాంబులు కాకుండా నిర్మాణాలు చేపట్టే కొత్త తరం నాయకత్వాన్ని అమెరికన్లు ఎన్నుకున్నారని మమ్దానీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఆయన గతంలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం తెలిసిందే.