స్వచ్ఛత ప్రచారంలో భాగస్వామ్యం: బెల్లంపల్లిలో ఘనంగా మిషన్ క్లీన్ నిర్వహణ
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
గాంధీ జయంతిని పురస్కరించుకుని బెల్లంపల్లి బజార్ ఏరియాలో సెయింట్ మేరీస్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ క్లీన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్‌బాబు పాల్గొన్నారు. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.