ట్రాఫిక్ కష్టాలకు చెక్: లక్డీకాపూల్ ప్రాంతంలోనూ వన్వే విధానం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని లక్డీకాపూల్ ప్రాంతంలోనూ వన్వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. నిత్యం వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్న ఈ ప్రాంతంలో రాకపోకలను క్రమబద్ధీకరించి ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్త ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్ లో విజయవంతమైన వన్వే విధానాన్ని ఇప్పుడు మరిన్ని రద్దీ ప్రాంతాలకు విస్తరించే దిశగా పోలీసు శాఖ చర్యలు చేపట్టిందని అధికారులు స్పష్టం చేశారు.