రాజస్థాన్ లో మరో ర్యాగింగ్ కలకలం: ఎన్ఎంసీ సీరియస్ హెచ్చరికలు
రిపోర్టర్: గోపి
స్థలం: Churu
రాజస్థాన్ లోని చురు వైద్య కళాశాలలో లైంగిక వేధింపులు మరియు బెదిరింపులతో కూడిన తీవ్రమైన ర్యాగింగ్ ఉదంతం వెలుగు చూసినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తక్షణ నివేదిక అందించాలని కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించినట్లు ఎన్ఎంసీ వెల్లడించింది. రాష్ట్రంలో అక్టోబర్ నుంచి ఇప్పటివరకు పదమూడు ర్యాగింగ్ కేసులు నమోదైనట్లు వైద్య వర్గాలు స్పష్టం చేశాయి.