నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ కోరుతూ వినతి

రిపోర్టర్: రాజేష్ స్థలం: గుంటూరు

నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో ఐదు ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించాలని కోరుతూ పొన్నూరు టౌన్ డెవలప్మెంట్ కమిటీ మరియు నిడుబ్రోలు రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్తో కలిసి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్నకు మరోసారి వినతిపత్రం సమర్పించినట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. స్థానిక ప్రజల ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైలు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్పై సానుకూలంగా స్పందించి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.