యువ నాయకుడు చిలుముల వెంకటస్వామి జన్మదిన వేడుకలు.....
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నాల్గవ వార్డు సభ్యుడు చిలుముల వెంకటస్వామి జన్మదిన వేడుకలు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి నివాసంలో ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, వెంకటస్వామిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జర్పుల సాయికిరణ్, ఉపసర్పంచ్ సింగతి శ్యామల అర్జయ్యతో పాటు పలువురు సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.