కావలిలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా కలకలం!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
కావలి పట్టణం వెంగళరావునగర్లో రెవెన్యూ అధికారుల సహకారంతో ఖాళీ ప్లాట్లు, ఓపెన్ సైట్లు దొడ్డిదారిన అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 22ఏ నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందిన భూములను ఆసరాగా చేసుకుని నకిలీ పట్టాలతో విస్తీర్ణాన్ని పెంచుకుంటూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమ దందాపై మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.