రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించిన ఏడీఏ తాతారావు
రిపోర్టర్: శివ
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో ఏటీఎంఏ ఆధ్వర్యంలో రైతులకు ఆర్పీఎల్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. మణుగూరు ఏడీఏ తాతారావు మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. చీడపీడల నివారణ, సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.