టెలివిజన్ షోలో భావోద్వేగం: గత జ్ఞాపకాలతో కన్నీరు పెట్టుకున్న సారా గుర్పాల్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
రైజ్ అండ్ ఫాల్ 2 రియాల్టీ షోలో గౌతమ్ గులాటి ప్రవర్తన తన గత దాడులను గుర్తుకు తెచ్చిందని నటి సారా గుర్పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ టేబుల్ ఎక్కి చేసిన హడావుడి తనను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని, తన మాజీ భాగస్వామి వేధింపుల జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందు కదిలాయని ఆమె పేర్కొన్నారు. ఎవరికీ భయపడేది లేదని తేల్చిచెప్పిన సారా, తనను బెదిరించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని స్పష్టం చేశారు.