ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
రిపోర్టర్: రమేష్
స్థలం: ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరం జలమయమవడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ట్రాఫిక్ స్తంభించడంతో పాటు విమాన సర్వీసులపై ప్రభావం పడింది. కన్నాట్ ప్లేస్, గీతా కాలనీ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. విమాన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ లైన్స్ సూచించాయి. ఆదివారం నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.