గుంతలమయంగా మారిన ప్రధాన రహదారిపై ప్రయాణించలేక ప్రజల అవస్థలు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొమ్మిక, కంఠారం, బలరాం, బాకులూరు, ఆడకుల గ్రామాల ప్రజలకు చోద్యం మీదుగా బొర్రంపేటకు వెళ్లేందుకు ప్రధాన రహదారి ఒక్కటే ఉంది. అయితే ఈ రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు చేరడంతో ప్రమాదాల భయం నెలకొంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.