కుమారుడి మరణం తర్వాత వార్తలని కొట్టిపారేసిన ఛార్లీ కిర్క్ తల్లి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: United States
కుమారుడు ఛార్లీ కిర్క్ మరణానంతరం ఆస్తి తగాదాలు వచ్చాయంటూ వస్తున్న వదంతులు అవాస్తవమని తల్లి కాథ్రిన్ కిర్క్ తెలిపారు. వ్యానిటీ ఫెయిర్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కోడలు ఎరికా కిర్క్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఈ విషాదం తమను మరింత దగ్గర చేసిందని స్పష్టం చేశారు. ఎరికా సంస్థ బాధ్యతలు చేపట్టడాన్ని కుటుంబం పూర్తిగా సమర్థిస్తోందని ఆమె పేర్కొన్నారు.