విజయవాడ మేయర్ ఎన్నికల ప్రచారం: రౌడీయిజం నుంచి విముక్తి కల్పించాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు పిలుపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయవాడ
నేరాలు, కబ్జాల నుంచి విజయవాడ విముక్తి పొందాలన్నా, నగరం అభివృద్ధి చెందాలన్నా గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేసి మేయర్గా తనను గెలిపించాలని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఎ.బి.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన మంగళవారం రోడ్ షో నిర్వహించారు. తాను సీపీగా ఉన్న రోజుల్లో రౌడీలు నదిని వదిలి పారిపోవాల్సి వచ్చిందని, బయటికి పెద్ద మనుషులుగా కనిపించే వారు కూడా అప్పట్లో పారిపోయారని ఆయన గుర్తుచేశారు.