విజయనగరం జిల్లాలో నేడు ప్రాదేశిక పోరు: ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో నేడు ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం భారీగా సిబ్బందిని, వాహనాలను రంగంలోకి దించామన్నారు. సున్నిత ప్రాంతాల్ లో ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.