అల్లవరం పోలీస్ స్టేషన్ తనిఖీ: సిబ్బందికి ఐజీపీ అశోక్ కుమార్ కీలక ఆదేశాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అల్లవరం

కోనసీమ జిల్లా అల్లవరం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ ఐజీపీ జి.వి.జి. అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గంజాయి తదితర మత్తుపదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటినుంచే పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.