హైదరాబాద్ లాలాగూడలో పాత కక్షలతో యువకుడు దారుణ హత్య.

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ సికింద్రాబాద్ పరిధిలోని లాలాగూడ తుకారాం గేట్ ప్రాంతంలో కార్తీక్ అనే యువకుడిని దుండగులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపారు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ ప్రేమ వ్యవహారంలో సహాయం చేసినందుకే పాత కక్షలతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.