ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మొదటి స్థానంలో మంత్రి అచ్చెన్నాయుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఏపీలో ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ర్యాంకులు ప్రకటించారు. గంటా 51 నిమిషాలకు ఒక ఫైల్ చొప్పున క్లియర్ చేసి అచ్చెన్నాయుడు వరుసగా మూడోసారి ప్రథమ స్థానం దక్కించుకున్నారు. నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి తదితరులు తర్వాతి స్థానాల్లో నిలవగా, పయ్యావుల కేశవ్ చివరి స్థానంలో ఉన్నారు.