మంచిర్యాలలో కోతుల బెడదతో వణికిపోతున్న కాలనీ వాసులు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ ఇస్లాంపుర, గౌతమి నగర్ రామాలయం పరిసరాలలో తీవ్రంగా ఉన్న కోతుల బెడదను అరికట్టాలని కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నగర మేయర్ మధుకర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. కోతుల గుంపులు స్థానిక భక్తులు, కాలనీవాసులపై దాడులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు బయటకు రావాలంటేనే తీవ్రంగా వణికిపోతున్నారని, అధికారులు తక్షణమే స్పందించి బోన్లు ఏర్పాటు చేయాలని కోరారు.