మెదక్ ఐడీఓసీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు: జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: మెదక్
మెదక్ ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో జాతీయ పోషణ మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం తో పాటు జిల్లా స్థాయి బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ మెదక్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.