హుస్నాబాద్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ రష్మి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ హుస్నాబాద్ పట్టణంలో పర్యటించి రానున్న వినాయక నిమజ్జనోత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన బందోబస్తు చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఎఫ్ఎస్టీపీ కేంద్రాన్ని, ఎల్లమ్మ చెరువు వద్ద గ్లాస్ బ్రిడ్జిని సందర్శించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఏసీపీ సదానందం ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.