డేటా షేరింగ్ పాలసీ రూపకల్పన: సలహాలు కోరుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

ప్రజల డేటాను సురక్షితంగా పంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ముసాయిదా డేటా షేరింగ్ ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విధానంపై పరిశోధకులు, విద్యావేత్తలు మరియు వివిధ భాగస్వాముల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అందిన ప్రతిపాదనలను క్రోడీకరించి త్వరలోనే పూర్తిస్థాయి డేటా షేరింగ్ పాలసీని తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.