మృత్యువు ఒడిలోనూ ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన ఆటో డ్రైవర్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడలో ఆటో డ్రైవర్ రాజ్య నాయక్ అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు రెండు కళ్ళను ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైద్యులకు దానం చేశారు. ఈ నిర్ణయంతో ఇద్దరి జీవితాల్లో అంధత్వాన్ని తొలగించి కొత్త వెలుగులు నింపినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ గొప్ప నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.