మనుబోలు మండలంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఏకాదశి పూజలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని స్థానిక విష్ణు ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టగా ఉభయదాతలుగా పెనుగొండ ప్రభావతి కుటుంబం వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.