గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి: సొంత ఖాతాల్ లో నిధుల జమాకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

గ్రామ పంచాయతీల ఆర్థిక నిర్వహణలో కీలక మార్పు తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 43ను విడుదల చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటివరకు ట్రెజరీల ద్వారా అమలైన విధానాన్ని రద్దు చేస్తూ, పంచాయతీల ఆదాయాలను సమీపంలోని బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్ లోని సొంత ఖాతాల్ లో జమ చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పల్లెల ఆర్థిక స్వావలంబనకు, స్థానిక అభివృద్ధి పనుల నిర్వహణకు ఈ కొత్త నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.