హిందూ దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కల్పన

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్లో శ్రీరాముడు, పరమశివుడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా వలిగొండ క్రాస్రోడ్డు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. దేవుళ్లను రాజకీయాలకు వాడుతూ విభజించి మాట్లాడటాన్ని సహించబోమని స్పష్టం చేస్తూ, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని డిమాండ్ చేశారు.