ఐస్ లేని అర్జున్ రెడ్డిలా ఎపిక్ సినిమా ఉంటుంది: శివాజీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నటుడు శివాజీ తెలిపారు. 13 ఏళ్ల విరామం తర్వాత బలమైన పాత్ర కోసం ఎదురుచూశానని, ఈ సినిమా ఎమోషన్స్ చాలా సహజంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇది ఐస్ లేని ‘అర్జున్ రెడ్డి’ వంటి చిత్రమని, క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.