అనపర్తిలో సీసీ రోడ్డును ప్రారంభించిన పురందేశ్వరి

రిపోర్టర్: రమేష్ స్థలం: అనపర్తి

అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం పొలమూరు వనుమలమ్మ తల్లి గుడి నుండి మర్రిపుంత వరకు రూ.55 లక్షల వ్యయంతో MGNREGS మరియు జీపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.