*ఉపాధ్యాయ గణపతి రూపకల్పనకు విశేష స్పందన* గంగపుత్ర గాంధీ, పసుపులేటి హరిబాబు, గరికిపాటి రమేష్లకు ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సన్మానం
వినాయక చవితి సందర్భంగా వినూత్న ఆలోచనలతో సామాజిక చైతన్యాన్ని కలిగించే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ ఐ ఎస్ ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి. మునిచందు అన్నారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ వద్ద నవభారతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా సాధారణంగా విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అయితే విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న మత్తు పదార్థాల వ్యసనం, దాని వల్ల కలిగే అనర్థాలు, మహిళలపై హింస వంటి సామాజిక సమస్యలను ప్రజలకు అర్థమయ్యే విధంగా విజువలైజేషన్ రూపంలో చూపించడం ఎంతో గొప్ప ఆలోచన అని అన్నారు.
వినాయకుడి రూపంలోనే సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం శ్రీకాళహస్తిలోనే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచే ఆలోచన. యువతను ఆలోచింపజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని కోగిలి. మునిచందు అన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ గణపతికి సంబంధించిన పాటను రచించి, పాడిన గంగపుత్ర గాంధీ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అలాగే వినూత్న ఆలోచనతో వినాయకుడి రూపాన్ని రూపొందించిన పసుపులేటి హరిబాబు ని
ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా ఈ గొప్ప ఆలోచనకు రూపకల్పన చేసి, ప్రజలు మరియు యువతలో సామాజిక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ గణపతిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన నవభారతి యువజన సంఘం నాయకులు గరికిపాటి రమేష్ ని కూడా ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఇలాంటి వినూత్నమైన, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా నిర్వహించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యార్థులు, యువత మంచి మార్గంలో నడిచేలా, ప్రజల్లో సామాజిక బాధ్యత పెరిగేలా చేసే ప్రతి కార్యక్రమానికి మా మద్దతు ఉంటుంది అని కోగిలి. మునిచందు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు, యువకులు మరియు నవభారతి యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.