కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుటుంబంపై ఈడీ ఎఫ్ఐఆర్ కు సిఫారసు!
రిపోర్టర్: హరి
స్థలం: కేరళ
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ, అల్లుడు మహమ్మద్ రియాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేరళ డీజీపీని ఈడీ కోరింది. సీఎంఆర్ఎల్ లంచం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ సిఫారసు చేసింది. దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా విజయన్ అభివర్ణించగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని సీపీఎం స్పష్టం చేసింది.