వైకాపా అరాచకాలను దావూద్‌తో పోల్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

రాజకీయ పార్టీ ముసుగులో వైకాపా రౌడీలను పెంచి పోషిస్తూ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడింది వైకాపా రౌడీ మూకలేనని ధ్వజమెత్తారు. దావూద్‌ ఇబ్రహీంలా బెంగళూరులో కూర్చుని జగన్‌ అరాచకాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేవారిపై ప్రత్యేక చట్టం తెస్తామని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని స్పష్టం చేశారు.