పామూరు రెండో ఎంపీటీసీ స్థానానికి విజయ్ కుమార్ చారి పోటీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పామూరు

పామూరు పట్టణ రెండో ప్రాదేశిక ఎంపీటీసీ స్థానానికి బీసీ నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థానం బీసీ వర్గానికి కేటాయించడంతో ఆయన బరిలో నిలుస్తున్నారు. స్థానికంగా బలమైన పట్టు ఉన్న విజయ్ కుమార్ చారి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అనుచరులతో ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు.