ది ప్యారడైజ్ సినిమాలో తన కీలక సన్నివేశం తొలగింపుపై నటుడు రెమో రహీమ్ ఆవేదన
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
ది ప్యారడైజ్ చిత్రంలో తాను నటించిన సుదీర్ఘమైన ట్రక్ సన్నివేశాన్ని ఎడిటింగ్‌లో తొలగించడంపై నటుడు రెమో రహీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సినిమాలో తన ఐదు నుంచి ఏడు నిమిషాల సీన్ కట్ కావడంతో ఎంతో బాధపడ్డానని ఆయన తెలిపారు. అయితే సినిమాలోని లాజిక్లను ఎక్కువగా వెతకకుండా కేవలం సినిమాగా మాత్రమే ఆదరించాలని ప్రేక్షకులను రెమో కోరారు.