ఎర్రవల్లి దళితుల భూముల సర్కార్ నిర్ణయంపై భగ్గుమన్న బాధితులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

తెలంగాణలోని ఎర్రవల్లిలో సర్వే నంబర్ 325 పరిధిలోని 388 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఆసిఫ్ భూమి రద్దు ద్వారా స్వాధీనం చేసుకుని 800 మందికి పంచాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. నెల రోజుల్లో సర్వే పూర్తి చేసి పట్టాలు ఇస్తామని చెప్పడంపై దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా భూమిని వేరేవాళ్లకు ఎలా ఇస్తారంటూ దళిత రైతులు నిలదీస్తున్నారు. ఈ నిర్ణయం దళితుల పొట్టకొట్టే కుట్రగా మండిపడుతున్నారు.