అలియాస్ రుక్మిణి: నితిన్ సరసన బాలీవుడ్ భామ ఆఫియా సయ్యద్ ఎంట్రీ
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
అలియాస్ రుక్మిణి చిత్రంలో నితిన్ సరసన బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. స్కూల్ టీచర్‌గా రుక్మిణి పాత్రలో ఆఫియా లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ నాలుగో తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.