అమెరికాలో ఘోర విమాన ప్రమాదం: జనావాసాలపై ప్రైవేట్ జెట్ కుప్పకూలి తొమ్మిది మంది మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Florida
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు గవర్నర్ రాన్ డిశాంటిన్ వెల్లడించారు. టెక్సాస్ నుంచి బహామాస్ వెళ్తున్న ప్రైవేట్ జెట్ అదుపు తప్పి జనావాసాల మధ్య కుప్పకూలడంతో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదానికి ముందు పైలట్ అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరియు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.